
సాధారణంగా డబ్బులు విషయంలో తేడాలు వస్తే.. చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి! లక్షలు, వేలు అప్పు తీసుకొని ఇవ్వకుంటే మాత్రం పంచాయితీ పెట్టిమరీ వసూలు చేసుకుంటారు. కానీ ఆవేశంలో ఉన్నప్పుడు ఇచ్చిన అప్పు ఎంత? అన్న విషయం కూడా మర్చిపోయి.. ఎదుటివారి ప్రాణం తీస్తుంటారు కొందరు.
తాజాగా ముంబైలోని గిర్‌గామ్‌లో కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతున్న అర్జున్ యశ్వంత్ సింగ్ తోటి స్నేహితుడి చేతిలో హత్యకు గురయ్యాడు. అతని స్నేహితుడు మనోజ్ మరాజ్‌కోలే నుంచి 100 అప్పుగా తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గురువారం ఇద్దరూ మద్యం మత్తులో ఉండటంతో గొడవ కాస్త పెద్దగా మారింది. అనంతరం యశ్వంత్ సింగ్ నిద్ర పోయాడు.
కానీ, మద్యమత్తులో తీవ్రమైన కోపంలో ఉన్న మనోజ్.. సిమెంట్ దిమ్మెతో అర్జున్ యశ్వంత్ సింగ్ దాడి చేసి హత్య చేశాడు. అక్కడికక్కడే అర్జున్ మృతి చెందాడు. అక్కడినుంచి మనోజ్ పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితుడు మనోజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment