ప్రతీకాత్మక చిత్రం
మైసూరు: నలుగురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి మైసూరు ఎఫ్‌టీఏసీ కోర్టు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పుచెప్పింది. వివరాలు... 2019లో మైసూరు విజయనగరకు చెందిన దర్శన్ (19) ప్రభుత్వ బాల మందిరంలో ఉంటున్న సమయంలో అక్కడ ఉన్న నలుగురు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సంస్థ డైరెక్టర్ ఎంకే కుమారస్వామి విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో ఎఫ్‌టీసీ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి పదేళ్ల జైలు, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
దొంగ అత్త, అల్లుడు అరెస్టు
మైసూరు: చోరీలకు పాల్పడుతున్న అత్త, అల్లుడిని అరెస్ట్ చేసిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు పట్టణంలో చోటు చేసుకుంది. కొడుగు జిల్లా కుశాల నగరకు చెందిన నాగరాజు, అత్త ఆదియమ్మలను అరెస్ట్ చేసి వారి నుంచి 300 గ్రాముల బంగారు నగలు, కిలోకు పైగా వెండి స్వాధీనం చేసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయి.
ప్రేమజంట బలవన్మరణం
బనశంకరి: కలిసి జీవించడానికి పెద్దలు అడ్డుపడ్డారన్న ఆవేదనతో ప్రేమ జంట తనువు చాలించింది. హావేరి తాలూకా నాగనూరు గ్రామానికి చెందిన విద్యాశ్రీ గాలి (22), ఇర్షాద్ కుడచి (23) ఆత్మహత్య చేసుకున్నారు. మూడేళ్లుగా వీరులో ప్రేమలో మునిగి తేలుతున్నారు. విద్యాశ్రీ బీకాం చదువుతుండగా, ఇర్షాద్ కుడచి డిప్లొమా పూర్తిచేశాడు. ఇటీవల విద్యాశ్రీకి తల్లిదండ్రులు ఓ యువకునితో నిశ్చితార్థం చేశారు. ప్రేమకు దూరం కావడం ఎంతమాత్రం ఇష్టలేని విద్యాశ్రీ, ఇర్షాద్ కలిసి శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment