
చెన్నై: ఆన్‌లైన్ రమ్మీ ఉచ్చులో చిక్కుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు లో ఘటన జరిగింది. కోయంబత్తూరులో నివసించే మదన్‌కుమార్ (28) బ్యాంకు ఉద్యోగి. ఆన్‌లైన్ రమ్మీకి బానిసగా మారాడు. తొలుత బాగా డబ్బులు సంపాదించినప్పటికీ తర్వాత నష్టాలు రావడం మొదలైంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఒత్తిడి తట్టుకోలేక మదన్ మద్యానికి అలవాటు పడ్డాడు. శనివారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment