
ప్రతీకాత్మక చిత్రం
ఇండోర్: తన వెంటపడి వేధించొద్దని వారించినందుకు ఒక మైనర్ బాలికపై అమానుష దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని తుకోగంజ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. అమిత్ అనే యువకుడు కొంతకాలంగా ఒక మైనర్ బాలికకు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. బుధవారం స్కూల్ అడ్మిషన్ కోసం బాలిక ఫ్రెండ్‌తో కలిసి స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తుండడం గమనించిన అమిత్ ఆమెను వెంబడించాడు.బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
ఆమె అక్కడ గట్టిగా అరుస్తూ పారిపోయేందుకు ప్రయత్నించగా.. అమిత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె ముఖంపై పొడిచాడు. అయినా బాలిక మరోసారి ప్రతిఘటించడంతో ఆమె ముఖంపై బ్లేడ్‌తో గాటు పెట్టాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి ఘటనాస్థలి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో సృహతప్పి పడిపోయిన బాలికను తన ఫ్రెండ్ స్థానికుల సాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితుడు అమిత్ ఇండోర్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment