వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్
ములుగు: పోలీసులు మావోయిస్టు పార్టీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన డంప్ వివరాలు వెల్లడించారు.
మావోయిస్టు పార్టీ నాయకులు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, బడె చొక్కారావు అలియాస్ దామోదర్, బండి ప్రకాశ్, మైలారపు ఆడేలు అలియాస్ భాస్కర్, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ఆదేశాల మేరకు దళం సభ్యులు, మిలీషియా సభ్యులు కాల్వపల్లి అటవీ ప్రాంతంలో డంప్‌ను దాచినట్లు పోలీసులకు సమాచారం అందిందన్నారు.
ఈ మేరకు అడవిలో మూడు అడుగుల లోతులో తవ్వకాలు జరపగా నీలిరంగు డ్రమ్ము దొరికినట్లు తెలిపారు. అందులో 25 జిలెటెన్‌స్టిక్స్, 25 డిటోనేటర్లు, విప్లవ సాహిత్య పుస్తకాలు, పేలుడు పదార్థాలు ఉన్నట్లు వివరించారు. ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టు పార్టీ ప్రయత్నం చేస్తోందని ఎస్పీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment