
బనశంకరి: కోవిడ్ భయంతో ఓ విశ్రాంత ఉద్యోగి పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కర్ణాటకలో జరిగింది. రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా బీలేనహళ్లి తండాకు చెందిన సోమానాయక్ (72) డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది. శ్వాస సమస్య పెరగడంతో ఆందోళన ఎక్కువైంది. దీంతో సోమవారం డెత్‌నోట్ రాసి తోటలో కారులో కూర్చుని పిస్టల్‌తో షూట్ చేసుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. నా కారణంగా ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ డెత్‌నోట్‌లో రాసి ఉంది. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: కర్ణాటకలో మహిళల దైన్యం.. పోలీసుస్టేషన్లకు క్యూ)