
గాయపడటంతో ఫిట్స్ వచ్చిన మహిళ
సాక్షి, లింగసముద్రం: వివాహానంతరం వధువు పుట్టింటి నుంచి అత్తింటికి సారె తీసుకెళ్తుండగా వాహనం బోల్తా పడి నవ వధువుతో పాటు మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు గ్రామం వద్ద శనివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. క్షతగాత్రులు అందించిన వివరాలు.. నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన మాలతీకి, లింగసముద్రం మండలం మేదరమిట్లపాలెం గ్రామానికి చెందిన కోటా మోహన్‌బాబుకు ఈ నెల 25న వివాహమైంది. ఈ నేపథ్యంలో వధువు పుట్టింటి నుంచి అత్తింటికి సారె తీసుకుని శనివారం ఆమె తల్లిదండ్రులు, బంధువులతో కలిసి వరుడి ఇంటికి టాటా ఏస్ వాహనంలో బయల్దేరారు.
కొత్తపేట నుంచి పెదపవని వెళ్లే దారిలో రాళ్లపాడు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వాహనం రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. ప్రమాదంలో వాహనంలో ఉన్న 11 మందికీ గాయాలయ్యాయి. వీరిలో ఒక మహిళకు తీవ్రగాయాలతో పాటు ఫిట్స్ రావడంతో హుటాహుటిన అంబులెన్స్‌లో తరలించారు. నెల్లూరు జిల్లా కొండాపురం, కలిగిరి నుంచి వచ్చిన రెండు 108 వాహనాల్లో క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.దవండి: తువ్వాలులో జీఏవైరు పెట్టి మెడకు బిగించి హత్య
Comments
Please login to add a commentAdd a comment