linga samudram
-
పుట్టింటి నుంచి అత్తింటి సారె తీసుకెళ్తూ..
సాక్షి, లింగసముద్రం: వివాహానంతరం వధువు పుట్టింటి నుంచి అత్తింటికి సారె తీసుకెళ్తుండగా వాహనం బోల్తా పడి నవ వధువుతో పాటు మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు గ్రామం వద్ద శనివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. క్షతగాత్రులు అందించిన వివరాలు.. నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన మాలతీకి, లింగసముద్రం మండలం మేదరమిట్లపాలెం గ్రామానికి చెందిన కోటా మోహన్‌బాబుకు ఈ నెల 25న వివాహమైంది. ఈ నేపథ్యంలో వధువు పుట్టింటి నుంచి అత్తింటికి సారె తీసుకుని శనివారం ఆమె తల్లిదండ్రులు, బంధువులతో కలిసి వరుడి ఇంటికి టాటా ఏస్ వాహనంలో బయల్దేరారు. కొత్తపేట నుంచి పెదపవని వెళ్లే దారిలో రాళ్లపాడు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వాహనం రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. ప్రమాదంలో వాహనంలో ఉన్న 11 మందికీ గాయాలయ్యాయి. వీరిలో ఒక మహిళకు తీవ్రగాయాలతో పాటు ఫిట్స్ రావడంతో హుటాహుటిన అంబులెన్స్‌లో తరలించారు. నెల్లూరు జిల్లా కొండాపురం, కలిగిరి నుంచి వచ్చిన రెండు 108 వాహనాల్లో క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.దవండి: తువ్వాలులో జీఏవైరు పెట్టి మెడకు బిగించి హత్య -
చెత్త పేరుతో సంపద లూటీ!
సాక్షి, లింగసముద్రం(ప్రకాశం) : చెత్తతో సంపద తయారీ కేంద్రాల మాట ఎలా ఉన్నా ఆ పేరు చెప్పి మండలంలో అధికార పార్టీ నాయకులు బాగానే సంపాదించుకుంటున్నారు. చెత్త సేకరణ పేరుతో చేపట్టిన సంపద కేంద్రాల నిర్మాణాలు గ్రామస్థాయి నాయకులకు వరంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న వర్మీ కంపోస్ట్ షెడ్లు టీడీపీ నాయకులు ఉపాధిగా మలుచుకుని లక్షలాది రూపాయలు కొల్లగొట్టారు. గ్రామాల్లో ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇదీ..పరిస్థితి లింగసముద్రం మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు నిర్మించేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే సర్పంచ్ల పదవీ కాలం ముగియగానే టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఒక్కో షెడ్ నిర్మాణానికి రూ.4 లక్షల నుంచి 9 లక్షల వరకు మంజూరు కావడంతో ఇదే అదునుగా భావించి నిర్మాణాలు మొదలు పెట్టారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లింపులు ఉండటంతో టీడీపీ నాయకులు ఆడిందే ఆటగా ఉంది. నిర్మాణాలు పూర్తి చేయకుండానే మొత్తం బిల్లులు కాజేశారు. నిరుపయోగంగా ఉన్న సంపద కేంద్రం షెడ్డు మండలంలో 16 గ్రామ పంచాయతీల్లో కొన్ని సంపద కేంద్రాలు పూర్తయ్యాయి. మిగిలిన సంపద కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటన్నింటికీ దాదాపుగా రూ.1.09 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. గ్రామాలకు దూరంగా వీటిని నిర్మించడంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనేది స్పష్టమవుతోంది. ఈ సంపద కేంద్రాల్లో అసాంఘిక కార్యకలాపాలు రాత్రిళ్లు వ్యభిచారం, పగలు పేకాట వంటివి జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాల్సి ఉన్నా టీడీపీ నాయకుల స్థలాలకు అనువుగా ఉంటాయన్న చోట ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రం లింగసముద్రం గ్రామానికి చెత్త సంపద తయారీ కేంద్రాన్ని గ్రామానికి దాదాపు మూడు కిలో మీటర్ల దూరంలో నిర్మించారు. రూ.8 లక్షల వ్యయంతో ఈ సంపద కేంద్రాన్ని తాటాకుల కప్పుతో ఏడాది క్రితం నిర్మించారు. తాటాకుతో నిర్మించి ఏడాది కావడంతో తాటాకు లేచి పోయి శిథిలావస్థకు చేరింది. గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే మండలంలోని పంచాయతీల్లో చెత్త పేరుతో సంపద తయారీ కేంద్రాలు నిర్మించినా అవి నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. సంపద కేంద్రాల వినియోగించక పోవడంతో గ్రామాల్లో ఎక్కడ బడితే అక్కడ చెత్తా చెదారం, మట్టి దిబ్బలు, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు పేరుకు పోతున్నాయి. చెత్తా చెదారం మురుగు కాలువల్లో పడి అస్తవ్యస్తంగా మారుతున్నాయి. చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్వహణకు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ దూతలు ఎక్కడా కనిపించడం లేదు. చెత్త సేకరణ రిక్షాల కొనుగోలు ఊసేలేదు. పంచాయతీల్లో రిక్షాలను కొనుగోలు చేశామని అధికారులు చెబుతున్నా అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. -
కోతకు గురైన కట్ట
శివ్వంపేట: కొద్దిపాటి వర్షానికే చెరువుకట్ట కోతకు గురైంది. మండల పరిధిలోని దొంతి పంచాయతీ పరిధిలో లింగసముద్రం చెరువు మరమ్మతుల కోసం మిషన్‌కాకతీయ ద్వారా రూ. 25.70 లక్షలు మంజూరయ్యాయి. పూడిక, కట్ట వెడల్పు పనులు చేపట్టారు. కొద్దిపాటి వర్షానికే చెరువు కట్టకు పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని రైతులు చెప్పారు. మరమ్మతు పనులు సక్రమంగా చేపట్టకపోవడంతోనే చెరువుకట్ట కోతకు గురైందని ఆరోపించారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ ప్రతిప్రెడ్డిని వివరణ కోరగా కోతకు గురైన చెరువు కట్టకు మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. -
ఆధునికీకరణ నత్తనడకే..
లింగసముద్రం, న్యూస్‌లైన్: రాళ్లపాడు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ఈ పనుల కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జికా) కింద రూ. 23 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో రూ. 6.5 కోట్ల మెకానికల్ పనులను హైదరాబాద్‌కు చెందిన స్వప్న కనస్ట్రక్షన్, రూ. 16.5 కోట్ల సివిల్ పనులను విజయవాడకు చెందిన స్వర్ణ కనస్ట్రక్షన్స్ వారు టెండర్లలో దక్కించుకున్నారు. 2014 ఫిబ్రవరి 23 నాటికి పనులు పూర్తిచేసేలా అగ్రిమెంట్ అయ్యారు. అయితే మెకానికల్ పనులు రూ. 5.8 కోట్లకుగాను 95 శాతం పనులు పూర్తిచేశారు. విద్యుత్ పనులతో పాటు, చిన్నపాటి మరమ్మతులు నిలిచిపోయాయి. సివిల్ పనుల్లో రూ. 14.79 కోట్లకుగాను 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. సివిల్ పనులు ఏడాది నుంచి నత్తనడకన జరుగుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. సివిల్ పనుల్లో ప్రాజెక్టులోని కుడి కాలువ 12.1 నుంచి 16.3 కిలోమీటరు వరకు, జంగాలపల్లెలో 1.3 కిలోమీటరు వరకు లైనింగ్‌కు రూ. 6.7 కోట్లతో చేయాల్సిన పనులు నిలిచిపోయాయి. కుడికాలువ లైనింగ్ బదులు గైడ్‌వాల్ నిర్మించాలని ప్రాజెక్టు అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు, జికా ప్రతినిధులకు ఆరు నెలల క్రితం నివేదిక అందజే శారు. నివేదిక పరిశీలించి ఉన్నతాధికారులు గైడ్‌వాల్‌కు అవసరమైన నిధులు మంజూరు చేయకపోవడంతో కుడికాలువ లైనింగ్ పనులు నిలిచిపోయాయి. సివిల్ పనుల్లో కుడికాలువ లైనింగ్, గైడ్బ్యాక్, ప్రాజెక్టు రోడ్డు, క్వార్టర్స్ పనులు చేయాల్సి ఉంది. ముందుగా పాత క్వార్టర్లకు చెందిన పెంకుల గది పడేశారు. కానీ క్వార్టర్ల పనులు ప్రారంభించలేదు. అగ్రిమెంట్ ప్రకారం సివిల్ పనులు ఫిబ్రవరి చివరి నాటికి పూర్తిచేయాలి. నెల రోజుల క్రితం ప్రాజెక్టును సందర్శించిన జికా ప్రతినిధులు సివిల్ పనులు నత్తనడకన జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ చివరి నాటికి పూర్తిచేయాలని గడువు పొడిగించారు. అయినా పనుల వేగం పుంజుకోలేదు. దీనిపై ప్రాజెక్టు డీఈ శ్రీనివాసమూర్తిని వివరణ కోరగా జనవరి నుంచి పనులు ప్రారంభించాల్సి ఉండగా మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని కాంట్రాక్టర్ తెలిపారని చెప్పారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు నోటీసులిచ్చామన్నారు. కాంట్రాక్టు గడువును జూన్ వరకు పొడిగించారన్నారు. జంగాలపల్లె కాలువ, ప్రాజెక్టుపై రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.