
కోతకు గురైన కట్ట
శివ్వంపేట: కొద్దిపాటి వర్షానికే చెరువుకట్ట కోతకు గురైంది. మండల పరిధిలోని దొంతి పంచాయతీ పరిధిలో లింగసముద్రం చెరువు మరమ్మతుల కోసం మిషన్‌కాకతీయ ద్వారా రూ. 25.70 లక్షలు మంజూరయ్యాయి. పూడిక, కట్ట వెడల్పు పనులు చేపట్టారు. కొద్దిపాటి వర్షానికే చెరువు కట్టకు పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని రైతులు చెప్పారు. మరమ్మతు పనులు సక్రమంగా చేపట్టకపోవడంతోనే చెరువుకట్ట కోతకు గురైందని ఆరోపించారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ ప్రతిప్‌రెడ్డిని వివరణ కోరగా కోతకు గురైన చెరువు కట్టకు మరమ్మతులు చేయిస్తామని చెప్పారు.