సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు చేశారనే అభియోగాలపై సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్‌లో నమోదైన కేసులో లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అమీన్‌పూర్‌లో ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా మోసాలు చేసిందని కేసు నమోదైంది.
1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు రాగా, 38 అంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ. 900 కోట్లు సాహితీఇన్‌ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment