Sahithi Infrastructure
-
JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధించిన ఇంటిని ఖాళీ చేయకుండా వేధించడంతో పాటు తన సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 62 లో దివాకర్ రెడ్డికి ఇల్లు ఉంది. దానిని సాహితీ లక్ష్మీనారాయణకు అద్దెకు ఇచ్చారు. అయితే ఒప్పందం గడువును మూడేళ్లుగా నిర్ణయించుకున్నారు. ఒప్పంద గడువు 2023 మేతో ముగియడంతో ఇంటిని ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా... స్పందించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆపై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో అఫిడవిట్ వేసినట్లు జేసీ దివాకర్‌రెడ్డి గుర్తించారు. బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్‌లు తమకు లీజు గడువు ఇంకా ఉన్నట్లు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతో జేసీకి కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. లక్ష్మీనారాయణ, అతని న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పత్రాలను గమనించిన జేసీ.. ఒప్పందం తేదీని 2021 మే నెలగా చూపినట్లు గుర్తించారు. అంతేకాదు తన సంతకం ఫోర్జరీ జరిగిందని, నకిలీ పత్రాలతో బూదాటి లక్ష్మీనారాయణ, సాత్విక్, వారి న్యాయవాది మహమ్మద్ షాజుద్దీన్‌లు కోర్టును తప్పుదోవ పట్టించారని జేసీ పోలీసులను ఆశ్రయించారు. సోమవారం ఆయన ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సాహితీ ఇన్ఫ్రాకు షాక్.. రూ.200 కోట్ల ఆస్తులు సీజ్
-
సాహితీ ఇన్ఫ్రాకు షాక్.. రూ.200 కోట్ల ఆస్తులు సీజ్
సాక్షి, హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రాకు సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరి నాయకులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కేసు విచారణ ముమ్మరం చేయడంతో లక్ష్మీనారాయణ కుటుంబం అజ్ఞాతవాసంలోకి వెళ్లింది. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా (ఎస్ఐవీఐపీఎల్) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. టీఎస్–రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించాలి. కానీ లక్ష్మీనారాయణ శార్వాణి ప్రాజెక్టులో ప్రీలాంచ్ విక్రయాల కింద జనాల నుంచి వసూలు చేసిన రూ.504 కోట్ల సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించాడు. ఈ ప్రాజెక్టుల నుంచి కూడా రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన నారాయణ.. ఒక్కటంటే ఒక్కప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. శార్వాణి ఎలైట్ ప్రాజెక్టు కంటే ముందు సాహితీ సంస్థ మూడు ప్రాజెక్టులను ప్రారంభించింది. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో కార్తికేయ పనోరమ, మాదాపూర్‌లో కృతి బ్లోసమ్, మోకిలాలో సుధీక్ష ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో డిపాజిట్లను సేకరించాడు. -
సాహితి ఇన్ఫ్రాపై ప్రత్యేక బృందం ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: సాహితి ఇన్ఫ్రాపై సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సాహితి ఇన్ఫ్రాపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. ఫ్రీలాంచ్ పేరుతో కస్టమర్ల నుంచి వందల కోట్లను సాహితి ఇన్ఫ్రా వసూల్ చేసిన విషయం తెలిసిందే. సాహితి ఇన్ఫ్రా స్కామ్ మొత్తం రూ. 1800 కోట్లుగా పోలీసులు తేల్చారు. 9 ప్రాజెక్టుల పేరుతో భారీ మోసం చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు సాహితీ ఇన్ఫ్రాపై ఆరోపణలున్నాయి. 38 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు సాహితీఇన్‌ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. చదవండి: నా భర్తను దారుణంగా కొట్టి చంపేశారు’ -
సాహితీ ఇన్ఫ్రా పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రా పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బాధితుల ఫిర్యాదులపై విడివిడిగా కేసులు నమోదు చేయాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సాహితీ ఇన్ఫ్రా సవాల్ చేసింది. అన్ని పిటిషన్లు ఓకే కేసుగా పరిగణించాలని కోరింది. ఇప్పటివరకు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 42 కేసులు నమోదు కాగా.. సింగిల్ బెంచ్ తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని సాహితీ ఇన్ఫ్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. రియల్ ఎస్టేట్ పేరుతో 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు సాహితీ ఇన్ఫ్రాపై ఆరోపణలున్నాయి. 38 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు సాహితీఇన్‌ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితులు ఈ సంస్థపై కేసులు నమోదుచేశారు. చదవండి: జయత్రి ఇన్ఫ్రా పేరుతో ఘరానా మోసం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు -
సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు చేశారనే అభియోగాలపై సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్‌లో నమోదైన కేసులో లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అమీన్పూర్లో ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్ఫ్రా మోసాలు చేసిందని కేసు నమోదైంది. 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు రాగా, 38 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ. 900 కోట్లు సాహితీఇన్‌ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.