వైఎస్ వివేకానందరెడ్డి (ఫైల్ ఫోటో)
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మంగళవారం పులివెందులలోని వివేకా ఇంటివద్ద సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. హత్య జరిగిన రోజున నిందితులు ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించారు, ఎలా బయటకు వెళ్లారన్న దానిపై రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
వివేకా ఇంటికి నిందితులు బైకుపై రావడం, గేటు తీసి ఇంట్లోకి వెళ్లడం, హత్య జరిగిన విధానం, ఎవరెవరు ఎలా వచ్చారు, ఎప్పుడెప్పుడు వచ్చారు, ఎలా హత్య చేశారు, ఆ తర్వాత ఎలా వెళ్లారు అన్న దానిపై ఆ వ్యక్తుల ద్వారా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తూ వీడియో తీసుకున్నారు. ఆయుధాలను పట్టణంలోని రోటరీపురం వద్ద ఉన్న వంకలో వేసినట్టుగా అక్కడకు కూడా వెళ్లి రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment