CBI team
-
ఎమ్మెల్సీ కవిత నివాసంలో కొనసాగుతున్న సీబీఐ విచారణ
-
ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు
-
ఇవాళ ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు
-
నేడు ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ
-
వైఎస్ వివేకా ఇంటి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మంగళవారం పులివెందులలోని వివేకా ఇంటివద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. హత్య జరిగిన రోజున నిందితులు ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించారు, ఎలా బయటకు వెళ్లారన్న దానిపై రీకన్స్ట్రక్షన్ చేశారు. వివేకా ఇంటికి నిందితులు బైకుపై రావడం, గేటు తీసి ఇంట్లోకి వెళ్లడం, హత్య జరిగిన విధానం, ఎవరెవరు ఎలా వచ్చారు, ఎప్పుడెప్పుడు వచ్చారు, ఎలా హత్య చేశారు, ఆ తర్వాత ఎలా వెళ్లారు అన్న దానిపై ఆ వ్యక్తుల ద్వారా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ వీడియో తీసుకున్నారు. ఆయుధాలను పట్టణంలోని రోటరీపురం వద్ద ఉన్న వంకలో వేసినట్టుగా అక్కడకు కూడా వెళ్లి రీకన్స్ట్రక్షన్ చేశారు. -
వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారి బదిలీ
కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి సుధాసింగ్ బదిలీ అయ్యారు. ఈ నెల 24న ఆమె విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆమె స్థానంలో రామ్‌కుమార్ అనే ఎస్పీ స్థాయి అధికారి నియమితులయ్యారు. ఆదివారం కడపకు వచ్చిన ఆయన కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వివేకా హత్య కేసులో మరికొంతమందిని సీబీఐ అధికారుల బృందం సోమవారం నుంచి విచారించనుంది. -
అర్ధరాత్రి అంత్యక్రియలు ఉల్లంఘనే
లక్నో: హాథ్రస్ సామూహిక అత్యాచార బాధిత యువతి భౌతిక కాయాన్ని అర్థరాత్రి దహనంచేయడం మానవహక్కుల ఉల్లంఘన అని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. హాథ్రస్ లాంటి ఘటనల్లో శవ దహనానికి మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు లక్నో బెంచ్ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంప్రదాయాలను పాటించకుండా, అర్థరాత్రి శవాన్ని దహనం చేయడం బాధిత మహిళ మానవ హక్కులను, వారి కుటుంబ సభ్యులు, బంధువుల మానవ హక్కులను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. హాథ్రస్‌కు సీబీఐ బృందం హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను మంగళవారం సీబీఐ ప్రశ్నించింది. నేరం జరిగిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు. మంగళవారం ఉదయం హాథ్రస్ చేరుకున్న సీబీఐ బృందం మొదట బాధితురాలి సోదరుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తరువాత, వారి కుటుంబం నుంచి పూర్తి వివరాలను సేకరించారు. సంఘటన పూర్వాపరాలపై వారిని లోతుగా ప్రశ్నించారు. మరోవైపు, హాథ్రస్ కేసు విచారణకు సీబీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలో మరో నలుగురు అధికారులు కొత్తగా చేరారు. సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబ్ నుంచి కూడా నిపుణులు ఈ బృందంలో చేరారు. -
సీబీఐ అధికారులనే చితకబాదారు!
నోయిడా/న్యూఢిల్లీ: సాధారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారులు తనిఖీలు, విచారణకు వస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో విచిత్రంగా నిందితుడి బంధువులే సీబీఐ అధికారులకు చుక్కలు చూపించారు. మూకుమ్మడిగా చుట్టుముట్టి కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అధికారుల స్మార్ట్ఫోన్లు, గుర్తింపు కార్డులను లాక్కుని తగలబెట్టారు. చివరికి పోలీసులు సరైన సమయానికి అక్కడకు చేరుకోవడంతో బతుకుజీవుడా.. అనుకుంటూ అధికారులు బయటపడ్డారు. 2014లో యూపీలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(వైఈఐడీఏ)కు సంబంధించి రూ.126 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ కేసును తొలుత విచారించిన సీబీఐ ఇన్స్పెక్టర్ వీఎస్ రాథోడ్, ఏఎస్సై సునీల్‌దత్ అవినీతికి పాల్పడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి రాథోడ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో సునీల్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో సునీల్ ఇంటిలో సోదాలు నిర్వహించేందుకు ఐదుగురు సీబీఐ అధికారుల బృందం శనివారం సునీల్ సొంతూరు సోన్‌పురాకు చేరుకుంది. అంతలోనే అక్కడ సునీల్ కనిపించడంతో ఆయన్ను అరెస్ట్చేసేందుకు అధికారులు యత్నించారు. దీంతో సునీల్ బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా సీబీఐ అధికారులను చుట్టుముట్టి కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఇదే అదనుగా సునీల్ అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, సీబీఐ అధికారుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సీబీఐ అధికారులు ఫిర్యాదుచేయడంతో సునీల్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
సీబీఐ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
-
సీబీఐ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్, రోజ్‌వ్యాలీ స్కామ్ కేసులకు సంబంధించి ప్రశ్నించేందుకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి ఆదివారం సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. సీబీఐ బృందాన్ని లోపలికి అనుమతించకుండా వెలుపలే కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. రోజ్‌వ్యాలీ, శారదా చిట్‌ఫండ్ కేసుల్లో కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా చివరి ప్రయత్నంగా రాజీవ్ కుమార్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు నిలువరించడం ఉత్కంఠ రేపుతోంది. ఈ స్కామ్‌లపై పశ్చిమ బెంగాల్ పోలీసుల విచారణకు నేతృత్వం వహిస్తున్న కుమార్‌ను కేసులకు సంబంధించిన పత్రాల గల్లంతుపై ప్రశ్నించేందుకు సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదని దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. సీబీఐ అధికారుల బృందం కుమార్ ఇంటికి చేరుకోగానే నివాసం వెలుపలే కోల్‌కతా పోలీసులు, సెంట్రీలు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కుమార్ ఇంటికి మమతా బెనర్జీ కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకోవడంతో కుమార్ ఇంటివద్ద హైడ్రామా నెలకొంది. సీబీఐ బృందం, బెంగాల్ పోలీసుల వాగ్వాదంతో ఉద్రిక్తత ఏర్పడింది. సీబీఐ సిబ్బందిని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ సంసిద్ధమైన క్రమంలో కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు ఆమె బాసటగా నిలిచారు. -
హస్తిన లింకు హైదరాబాద్‌లో...
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సీబీఐ అంతర్గత పోరుకు ప్రధాన ‘కీ’ హైదరాబాద్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ ఎపిసోడ్‌పై కేసు.. ఢిల్లీ సీబీఐ పరిధిలో జరిగిన దాని మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ కేసులో అలోక్‌వర్మతోపాటు స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తాన్‌ల మధ్య పోరు తీవ్రమవడం, ఆ తర్వాత ఇద్దరినీ సెలవులో పంపడం, కొందరిని బదిలీ చేయడం, ఇన్చార్జి డైరెక్టర్‌గా మరో అధికారి రావడం అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన సాన సతీశ్‌బాబు సీబీఐ అధికారులపై చేసిన అవినీతి ఆరోపణలు, డబ్బుల డిమాండ్ వ్యవహారంపై ప్రత్యేక బృందం శుక్రవారం హైదరాబాద్ చేరుకుంది. ఓ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని అధికార బృందం ఢిల్లీ నుంచి మొయిన్ ఖురేషీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ విచారించేందుకు రావడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఖురేషీతో సంప్రదింపులు జరిపిన సుఖేశ్‌గుప్తా, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, వ్యాపారవేత్త సాన సతీశ్‌బాబును మరోసారి విచారించేందుకు సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చినట్లు తెలిసింది. సీఎం రమేశ్ లింకేంటి? అలాగే సాన సతీశ్ బాబును కాపాడేందుకు టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ కూడా సీబీఐ డైరెక్టర్లను సంప్రదించిన ఎపిసోడ్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వారితో ఖురేషీ మధ్యవర్తిత్వం, అప్పటి సీబీఐ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలతో సాగించిన లావాదేవీలపై వీరిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు డైరెక్టర్లపై సతీశ్‌బాబు ఇచ్చిన వాంగ్మూలంలో నిజానిజాలు తేల్చే వ్యవహారంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం రమేశ్‌కు సీబీఐ డైరెక్టర్లకు ఉన్న లింకు ఏంటి? డైరెక్టర్లతో ఎప్పటి నుంచి లాబీయింగ్ చేస్తున్నారు? ఏయే కేసులో వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు? తదితర అంశాలపై రమేశ్‌ను ప్రశ్నించడంతో పాటు ఆయన కార్యాలయాలు, నివాసంలో సోదాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల జరిగిన ఐటీ సోదాల్లో ఈ కేసులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లభించాయని, వీటి ద్వారా డైరెక్టర్ల వ్యవహారంలో మరింత క్లారిటీ వస్తుందని, ఈ కోణంలోనూ విచారణకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి. మంగళవారమే సతీశ్‌బాబును సీబీఐ ఢిల్లీ అధికారులు అక్కడికి పిలిపించి కొన్ని అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. అంతలోనే అధికారుల బృందం హైదరా బాద్ రావడం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రస్తుతం సీఎం రమేశ్ విదేశీ పర్యటనలో ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. -
సీబీఐ, ఐటీ అధికారుల ఢిష్యుం ఢిష్యుం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో సీబీఐ అధికారులపై ఆదాయపన్ను శాఖ అధికారులు భౌతికదాడికి పాల్పడ్డారు. లక్నోలో ఇన్‌కంట్యాక్స్ అధికారిణి లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు ఆదాయపుపన్ను అధికారిణిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆదాయపు పన్ను ఆఫీసులో పనిచేస్తున్న ఇతర అధికారులు సీబీఐ అధికారులపై బౌతిక దాడికి దిగారు.