శారదా చిట్‌ఫండ్, రోజ్‌వ్యాలీ స్కామ్ కేసులకు సంబంధించి ప్రశ్నించేందుకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి ఆదివారం సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. సీబీఐ బృందాన్ని లోపలికి అనుమతించకుండా వెలుపలే కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. రోజ్‌వ్యాలీ, శారదా చిట్‌ఫండ్ కేసుల్లో కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.