
(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : యువతిపై దాడి చేసిన కేసులో శేరిలింగం పల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ను సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం నల్లగండ్లలోని గ్రేటర్ కమ్యూనిటీలో ఉండే ఓ ఫ్యాషన్ డిజైనర్ యువతితో నాగేందర్ గొడవ పడ్డారు. అనంతరం యువతిపై దాడి చేశారు. దీంతో సదరు యువతి షీ టీమ్‌ను ఆశ్రయించి, అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment