
సాక్షి, ములుగు : వాజేడు మండలంలోని బొగత జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గల్లంతయ్యారు. వివరాల ప్రకారం హన్మకొండకు చెందిన గోపీనాథ్, హైదరాబాద్‌కు చెందిన తన ఇద్దరు మిత్రులతో కలిసి బొగతజలపాతం సందర్శన కోసం వెళ్లారు. అయితే అక్కడ అనుమతి లేకపోవడంతో దొడ్డిదారి ద్వారా జలపాతం వద్దకు చేరుకొని స్నానం చేసేందుకు దిగారు. అనూహ్యంగా వరద ఉదృతి పెరగడంతో గోపీనాథ్ గల్లంతయ్యారు. స్నేహితులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.