ప్రతీకాత్మక చిత్రం
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): తల్లిని చిత్రహింసలు పెడుతున్న తండ్రిని కొడుకే బ్లేడ్‌తో గొంతుకోసి చంపిన ఘటన శనివారం మదనపల్లెలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, తమిళనాడులోని దేవికాపురానికి చెందిన కదిరేషన్(45), భార్య మలార్‌కుడి, కుమార్తె శ్రీమతి, కుమారుడు ఆదికేశవ్(19) మూడేళ్ల క్రితం మదనపల్లె నీరుగట్టువారిపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. చేనేత పనిచేసి కదిరేషన్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను ప్రతిరోజు భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. తండ్రిపెట్టే చిత్రహింసలు ఇంటర్ చదువుతున్న కుమారుడు ఆదికేశవ్ సహించలేకపోయాడు.
చదవండి: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను పణంగా పెట్టి..
శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి గొంతును బ్లేడ్‌తో కోసి పరారయ్యాడు. శనివారం ఉదయం గమనించిన భార్య, కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారమందుకున్న వన్‌టౌన్ సీఐ ఈదురుబాషా, ఎస్‌ఐ లోకేష్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడి సోదరుడు సెల్వకుమార్ ఫిర్యాదు మేరకు వేధింపులు తాళలేకనే అతని కుమారుడు ఆదికేశవ్ ఈ హత్య చేశాడని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment