
ప్రతీకాత్మక చిత్రం
చెన్నై: తమిళనాడులోని చెన్నై అంబత్తూరులో 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల వ్యవహారంలో తల్లిని ఆమె వివాహేతర ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. కొరట్టూరు రైల్వేస్టేషన్ రోడ్డుకు చెందిన ప్రియాంక (37) భర్త నరేష్ కుమార్‌తో మూడేళ్ల క్రితం విడిపోయింది. రెండేళ్ల నుంచి అంత్తూరు తిరువెంకటనగర్‌కు చెందిన సందీప్‌తో సహజీవనం చేస్తోంది.
శుక్రవారం రాత్రి ప్రియాంక కుమార్తె (15)పై సందీప్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి ప్రియాంక సహకరించింది. ఘటనపై జిల్లా బాలిక సంరక్షణ భద్రత అధికారి జేమ్స్‌కుమార్‌కు సమాచారం అందింది. ఆయన అంబత్తూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌జ్యోతిలక్ష్మి ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసునమోదు చేసింది.
చదవండి: దారుణం: 70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి
Comments
Please login to add a commentAdd a comment