
ప్రతీకాత్మక చిత్రం
వేలూరు(చెన్నై): ఓ భర్త తన మొదట భార్యకు ముద్దు పెట్టడాన్ని జీర్ణించుకోలేని రెండో భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరుపత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లాలోని జోలార్‌పేట సమీపంలో ఉన్న మండలవాడి గ్రామానికి చెందిన రాజ కుమారుడు ప్రభాకరన్(28) ఆర్మీలో సిపాయి. ఇతనికి పూర్ణిమతో పెళ్లి అయింది. అయితే ఎవరికీ తెలియకుండా అదే గ్రామానికి చెందిన సారికను ప్రేమించి 2019లో రెండో వివాహం చేసుకున్నాడు. దీనిపై సారిక తండ్రి పళణి జోలార్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు ప్రభాకరన్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జామీనుపై ఇంటికి వచ్చాడు. అమ్మగారింటిలో ఉన్న సారికను ప్రభాకరన్ ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు భార్యలు ఒకే ఇంటిలో ఉండాలని ప్రభాకరన్ తెలపడంతో సారిక మరోసారి పుట్టింటికి వెళ్లిపోయింది. గత నెల 29వ తేదీన ప్రభాకరన్ జన్మదినం కావడంతో మొదటి భార్య పూర్ణిమను తీసుకుని రెండోభార్య సారిక ఇంటికి వెళ్లాడు. అక్కడ ప్రభాకరన్ బర్త్ డే కేక్ కట్ చేసి మొదటి భార్యతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో సారిక ఎదుటే మొదటి భార్య పూర్ణిమకు ప్రభాకరన్ ముద్దులు పెట్టాడు. ఇది జీర్ణించుకోలేని సారిక బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న జోలార్‌పేట పోలీసులు మృతదేహాన్ని తిరుపత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే సారిక 12 పేజీలతో కూడిన రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఘటనపై విచారణ చేస్తున్నారు.
చదవండి: Karnataka: డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. యువతులకు అసభ్యకర వీడియోలు పంపి..
Comments
Please login to add a commentAdd a comment