అనకాపల్లి టౌన్: విశాఖ జిల్లాలో దళిత యువకులపై టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. స్తంభాలకు కట్టేసి నోటి వెంట రక్తం పడేలా కొట్టారు. అనకాపల్లి మండలంలోని జీవీఎంసీ విలీన గ్రామం కేఎన్‌ఆర్ పేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 10వ తేదీ రాత్రి మారేడుపూడి ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు రాకేష్, లోకనాథ్‌లు బైక్‌పై వేగంగా వెళుతున్నారు. అదే సమయంలో టీడీపీకి చెందిన ఆ ప్రాంత మాజీ సర్పంచ్ కె.సత్యనారాయణ యువకులపై ఆగ్రహించారు.
యువకులు ఎదురు తిరగడంతో ఆగ్రహించిన సర్పంచ్ అనుచరులు సమీపంలోని రెండు స్తంభాలకు వారిని కట్టేసి నోటి నుంచి రక్తం పడేలా తీవ్రంగా కొట్టారు. వారి తల్లి రాజ్యలక్ష్మి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కశిరెడ్డి సత్యనారాయణ, కరిత్తుల లక్ష్మణకుమార్, కశిరెడ్డి అప్పారావు, కశిరెడ్డి విరోదికుమార్, బెల్లాన మధు, కశిరెడ్డి ముఖేష్, గొంతిన లక్ష్మిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
దళిత యువకులపై టీడీపీ నేతల దాష్టీకం
Published Sun, Nov 14 2021 3:33 AM | Last Updated on Sun, Nov 14 2021 3:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment