సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తణుకు సమీపంలో ఓ కారు అదపు తప్పి పంట కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వారిలో ఒకరు స్థానిక మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జీవన శేఖర్, ఆర్‌టీఓ ఆఫీస్‌లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను, వెలుగు డిపార్ట్‌మెంట్ ఉద్యోగిని సుభాషిణిగా పోలీసులు గుర్తించారు. వీరు విధులకు హాజరుకావడానికి భీమవరం నుంచి తణుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తణుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీఓ కార్యలయంలో ఉద్యోగి శ్రీను
జీవన శేఖర్ మునిసిపల్ ఉద్యోగి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుభాషిణి
తణుకులో కారు బోల్తా: ముగ్గురు మృతి
Published Mon, Sep 14 2020 1:12 PM | Last Updated on Mon, Sep 14 2020 2:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment