
కేపీహెచ్‌బీ కాలనీ(హైదరాబాద్): కారులో పెట్రోల్ పోయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఉడాయించిన ముగ్గురిని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డీఎస్‌ఐ శ్యాంబాబు వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండలో నివాసముండే మురుగన్ విశ్వంబర్ పాటిల్ కేపీహెచ్‌బీ మెయిన్‌రోడ్డులోని భారత్ పెట్రోల్ పంపులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు.
ఈ నెల 3న తెల్లవారుజాము 3.30 లకు ఎల్‌బీనగర్ ప్రాంతానికి చెందిన మేరావత్ మహేష్‌బాబు (19), వకునావత్ బాబు (23), గోడ శ్రావణ్‌కుమార్ (20) కారులో వచ్చి ఫుల్‌ట్యాంక్ చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా కారుతో ఉడాయిస్తుండగా విశ్వంబర్ పాటిల్ చేయి కారు అద్దంలో ఇరుక్కుపోయి కింద పడిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా సోమవారం ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment