
సాక్షి, నడియాడ్ : గుజరాత్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అహ్మదాబాద్-వడోదర 8వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న సంఘటనలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నడియాడ్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు అగ్నిమాపకశాఖ సూపరింటెండెంట్ దీక్షిత్ పటేల్ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment