
భోపాల్ : తమ ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిసిందని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సియోని జిల్లా కొంద్రా గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు(ఒకరి వయసు 18 ఏళ్లు, మరొకరిది 16 ఏళ్లు), అదే జిల్లాకు చెందిన ఇద్దరుయువకులతో ప్రేమలో పడ్డారు. కాగా, ఇటీవల వీరిలో ఒకరి బాయ్‌ఫ్రెండ్ ‘మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను’ అంటూ ఆమె తండ్రికి మెసేజ్ పంపాడు. దీనిని ఇంట్లో వారంతా చూశారు.
(చదవండి : బస్సులో మంటలు : ఐదుగురు సజీవ దహనం)
తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిందని ఆందోళనకు గురైన ఇద్దరు యువతులు.. ఇంట్లో నుంచి పారిపోయి గ్రామానికి సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మెసేజ్ పంపిన యువకుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment