
సాక్షి, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలోని పెబ్బేరులో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో జూరాల కాలువలో దూకింది. ఇది గమనించిన స్థానికులు ఒకరిని రక్షించగా.. తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు.
కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.