
సాక్షి, హైదరాబాద్: నాటకీయ పరిణామాల మధ్య పీటల మీదకు వచ్చిన ఓ పెళ్లి ఆగిపోయింది. సికింద్రాబాద్ క్లాక్‌టవర్ ప్రాంతంలోని ఓ చర్చి ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం జనగాం జిల్లా యశ్వంతపూర్‌కు చెందిన అనిల్‌తో అడ్డగుట్టకు చెందిన యువతితో పెళ్లి జరగాల్సి ఉంది. బంధువులందరూ వచ్చారు...విందు సిద్ధమైంది.. కొద్ది నిమిషాల్లో పెళ్లి జరుగనుంది. అయితే అంతలోనే..అదే గ్రామానికి చెందిన యువతి వచ్చి పెళ్లి కొడుకు తనను ప్రేమించి మరో అమ్మాయితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని గొడవ చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అతను ప్రేమించినట్లు ఆధారాలు లేకపోవడంతో మార్కెట్ పోలీసులు తామేమీ చేయలేమని పేర్కొన్నారు. (పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో..)
ఒకవైపు ఇది జరుగుతుండగానే పెళ్లి కుమార్తె మైనర్ అంటూ కొంత మంది చైల్డ్‌లైన్ అధికారులకు ఎవరో ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి పెళ్లి కుమార్తె మైనర్ అని తేల్చారు. మేజర్ కావడానికి మరోమూడు నెలల సమయముందని తేల్చారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరస్వతి హరిప్రియ, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ మాధవీరెడ్డి మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒకదాని తర్వాత ఒక సమస్యతో పీటల మీదకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కోసం వచ్చిన బంధువులందరు వెళ్లిపోయారు. (భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం)
Comments
Please login to add a commentAdd a comment