
ప్రతీకాత్మక చిత్రం
తిరువణ్ణామలై (చెన్నై): భార్యను హత్య చేసిన కేసులు భర్తను పోలీసులు అరెస్టు చేశా రు. తిరువణ్ణామలై సమీపం కస్తంబాడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ, గౌతమి(28) దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజ మద్యానికి బానిసై భార్యతో తరచూ ఘర్ష ణ పడేవాడు. విషయం తెలుసుకున్న విదేశంలో ఉన్న గౌతమి తల్లి అక్కడి నుంచి రూ.3 లక్షలు కుమార్తె ఖాతాకు వేసింది. ఆ డబ్బు కోసం బుధవారం రాత్రి రాజా భార్యతో మళ్లీ గొడవ పడ్డాడు. అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన గౌతమి తిరిగి రాలేదు.
మరుసటి రోజు ఇంటి సమీపంలోని చెరకు తోటలో కాలిన గౌతమి శవం కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. రాజను పోలీసులు రహస్యంగా విచారించడంతో హత్య చేసి, చెరకు తోటలో కాల్చినట్లు అంగీకరించాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment