వివాహితను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకొని.. గర్భం దాల్చడంతో | Woamn Extra Marital Affair In Warangal | Sakshi
Sakshi News home page

వివాహితను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకొని.. గర్భం దాల్చడంతో

Published Sat, Apr 22 2023 12:50 PM | Last Updated on Sat, Apr 22 2023 12:50 PM

Woamn Extra Marital Affair In Warangal - Sakshi

వరంగల్: ఓ వివాహితను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువకుడు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు. ఈమేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 65వ డివిజన్‌ చింతగట్టులోని సుభాశ్‌నగర్‌ ప్రాంతానికి ఓ యువతికి ఎనిమిదేళ్ల క్రితం హుజూరాబాద్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది.  ఏడాది క్రితం ఆయువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యవహారంలో భార్యనే నిందితురాలిగా పేర్కొన్నారు.

ఈక్రమంలో ఒంటరిగా ఉన్న ఆ వితంతువును అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు  పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరక సంబంధాన్ని ఏర్పర్చుకోవడంతో ఆమె గర్భందాలి్చంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుబట్టడంతో యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ.. శుక్రవారం బాధితురాలు కాకతీయ యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. 

నాలుగు రోజులైనప్పటికీ  పోలీసులు మాత్రం స్పందించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకోవాలని సలహా ఇస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు ఎస్సై సతీశ్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement