తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని పశువుల హాస్పిటల్ సమీపంలో ఓ వివాహిత గురువారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిలో నివాసముండే బసవ పూర్ణమ్మ ఏకైక కుమార్తె వంగ లక్ష్మికి 10 సంవత్సరాల కిందట వివాహం చేసింది. అప్పట్లో భర్తతో విభేదాలు తలెత్తడంతో విడిపోయి మరల రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తకు ఒక కొడుకు, రెండో భర్తకు ఒక కుమార్తెకు జన్మించారు.
అయితే రెండో భర్తతో కూడా విభేదాలు తలెత్తడంతో అతడితో కూడా విడిపోయి విజయవాడలో రాజరాజేశ్వరిపేటలో నివాసముండే ఇర్ఫాన్‌తో సహజీవనం చేస్తోంది. రెండు రోజుల కిందట తాడేపల్లిలో ఓ శుభ కార్యానికి వచ్చింది. సహజీవనం చేస్తున్న ఇర్ఫాన్‌తో మనస్పర్ధలు వచ్చి తాడేపల్లిలోని తల్లి ఇంట్లో ఉంటోంది. తల్లి, పిల్లలు ఇంట్లో లేని సమయంలో నా చావుకు ఎవరూ కారణం కాదంటూ ఒక లెటర్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరిగిన ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment