Viral: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి | Woman Family Beat On Man With Hammer And Rod For Eloping | Sakshi
Sakshi News home page

దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి

Published Tue, Sep 14 2021 11:17 AM | Last Updated on Wed, Sep 15 2021 8:50 AM

Woman Family Beat On Man With Hammer And Rod For Eloping - Sakshi

భోపాల్‌: తమ కూతురిని ప్రేమించిన యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు తల్లిదండ్రులు. కొంతమంది దాడికి దిగి సదరు యువకుల ప్రాణాలు కూడా  తీయడానికి సిద్ధపడతారు. అయితే తాజాగా ఓ యువకుడిపై అతని ప్రేయసి తండ్రి, అన్న నడిరోడ్డుపై విచక్షణారహితంగా సుత్తి, ఇనుపరాడ్‌తో దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్పక్ భావ్సర్(22) అనే యువకుడు మక్సి నగరంలోని ఓ యువతి ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా.. ఇద్దరూ కలిసి ఇళ్ల నుంచి పారిపోయారు. అనంతరం యువతి తల్లిదండ్రులు, పెద్దలు వారిని ఇంటికి రావల్సిందిగా కోరగా.. వారు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు.

చదవండి: కలెక్టరేట్‌ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

అయితే వారు ఇంటికి వచ్చిన తర్వాత యువతి కుటుంబసభ్యులు పుష్పక్‌పై తీవ్రమైన కోపంతో రగిలిపోయారు. ఆదివారం పుష్పక్‌ కటింగ్‌ షాప్‌లో కటింగ్‌ చేసుకుంటున్న సమయంలో యువతి తండ్రి, అన్న ఒక్కసారిగా షాప్‌ నుంచి అతన్ని బయటకు లాక్కొచ్చారు. అనంతరం అత్యంత రద్ధీగా ఉండే మక్సీ వీధిలో వెంబడించి మరీ సుత్తి, ఇనుప రాడ్‌తో విచాక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో పుష్పక్‌ కాలు, చేతికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై యువకుడి తల్లిదండ్రులు.. యువతి తండ్రి, అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: మాజీ ఎంపీ మనవడి హత్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement