
ప్రతీకాత్మకచిత్రం
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. సీఐ ఇమాన్యుయేల్ రాజు తెలిపిన వివరాలివీ.. పాత ఆరిలోవకు చెందిన ఓ దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి నాలుగు రోజుల కిందట అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు.
చదవండి: (బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..)
ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. కాగా.. ఆరిలోవ పోలీసులు బాధితురాలి ఇంటికి చేరుకుని.. చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. దీనిపై బుధవారం కేసు నమోదు చేస్తారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment