
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : మరణించిన అన్న ప్రియురాలిపై వేధింపులకు పాల్పడ్డాడో యువకుడు. తన కోర్కెలు తీర్చాలంటూ వెంటబడి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ముంబై, మేఘ్‌వాడి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతి, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో సదరు యువకుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మృతుడి తమ్ముడు సెల్‌ఫోన్ అన్న సెల్‌ఫోన్‌ను వాడటం మొదలుపెట్టాడు. ( మాజీ కౌన్సిలర్ దారుణ హత్య )
ఈ నేపథ్యంలో అన్న, అన్న ప్రియురాలు కలిసి ఉన్న కొన్ని వీడియోలు అతడి కంటబడ్డాయి. దీంతో వాటిని ఆసరాగా చేసుకుని అన్న ప్రియురాలిపై వేధింపులకు దిగాడు. తన కోర్కెలు తీర్చకపోతే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ భయపెట్టసాగాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. యువకుడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment