![Youth Slits MCA Student Throat in Warangal, Accused Arrest - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/23/Wgl.jpg.webp?itok=P-TGhLfe)
సాక్షి, వరంగల్ జిల్లా: హన్మకొండ గాంధీనగర్‌లో యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది అజహర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అజహర్‌పై హత్యాయత్నంతో పాటు బెదిరింపు వేధింపులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు(శనివారం) కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇదిలా ఉండగా ప్రేమోన్మాది ఘాతుకంతో గాయపడిన అనూషకు వరంగల్ ఎంజీఎంలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అనూష కోలుకుంటోందని, ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు.
కాగా హనుమకొండ గాంధీనగర్‌లో శుక్రవారం ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడిన విషయం విదితమే. ప్రియురాలు గొంతుకోసి పారిపోయాడు. నర్సంపేట మండలం లక్నేపల్లికి కి అనూష కేయులో ఎంసిఏ ఫైనలియర్ చదువుతూ, హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈరోజు ఎంసిఏ ఎగ్జామ్ ఉండడంతో గాంధీనగర్‌లో కుంటుంబ సభ్యుల వద్దకు వచ్చింది.
చదవండి Warangal Premonmadi: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి..
అనూష వచ్చిన విషయం తెలుసుకున్న అజహర్ ఆమెను వెంబడించి చున్నీతో ముఖాన్ని చుట్టేసి ముందుగానే తనవెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర గాయంతో అరుచుకుంటూ బయటకు వచ్చిన ఆమెను స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. తాను పనికి వెళ్లి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయిందని విద్యార్థిని తల్లి రేణుక విలపించింది. తన కుమారుడు మూడేళ్ల క్రితం కేన్సర్‌తో మృతి చెందాడని, ఇప్పుడిలా జరిగిందంటూ ఆమె రోదించింది.
Comments
Please login to add a commentAdd a comment