
కిటకిటలాడిన అప్పనపల్లి
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు. తెల్లవారు జామున స్వామివారికి అర్చకులు తొలి హారతి, సుప్రభాత సేవ చేశారు. శ్రీలక్ష్మీ నారాయణ హోమాన్ని వైభవంగా జరిపించారు. భక్తులు గోశాలను సందర్శించి పూజలు చేశారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.3,36,920 ఆదాయం వచ్చింది. స్వామివారిని 4,500 మంది దర్శించుకోగా, 2,800 మంది అన్నప్రసాదం స్వీకరించారని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.76,836 విరాళాలుగా సమర్పించారన్నారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.72,120 వచ్చిందని అన్నారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment