
కదిలిస్తే.. కన్నీటి వేదన
కూటమి నాయకులు
మట్టి దోచుకుంటున్నారు
మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం నుంచి సఖినేటిపల్లి మండలం మోరిపోడు వరకూ విస్తరించి ఉన్న డ్రెయిన్ తవ్వకాలు రూ.47 లక్షలతో చేపట్టారు. ఆ తవ్వకాల్లో వచ్చిన మట్టిని అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. శ్మశాన వాటిక అభివృద్ధికని చెప్పి ఆరు ట్రాక్టర్లు మాత్రమే అక్కడ వినియోగించి, 400 ట్రాక్టర్లకు పైగా అమ్మేసుకున్నారు. దీనిపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశా.
– ముత్యాల
శ్రీనివాసరావు,
మానవ హక్కుల వేదిక, మలికిపురం మండలం
● పీజీఆర్‌ఎస్‌లో ప్రజల గోడు
● కూటమి నేతల దౌర్జన్యాలు,
అక్రమాలపై ఫిర్యాదులు
● గోదావరిలో ఇసుక, మట్టి అక్రమ విక్రయాలు అడ్డుకోవాలని అర్జీలు
సాక్షి, అమలాపురం/అమలాపురం రూరల్/ఉప్పలగుప్తం: అనారోగ్యం బారిన పడి.. ఇంటి వద్దనే ఉండి.. మూడు నెలలు బయటకు రాలేకపోతే పింఛన్ తొలగించారని ఒక వృద్ధురాలు.. గోదావరి ఇసుక అక్రమ తవ్వకాల వల్ల తమ భూములు కోతకు గురవుతున్నాయని ఒక రైతు.. గోదావరి ఇసుక ఒక్కటే కాదు.. డ్రెయిన్‌లో మట్టి కూడా తవ్వేసి అమ్ముకుంటున్నారంటూ సమాజ హితం కోరే ఒక వ్యక్తి.. రెవెన్యూ సిబ్బంది తప్పుడు రికార్డు సృష్టించి తమ ఫలసాయం తినేస్తున్నారని ఒక బాధితుడు.. ఇలా అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ – పీజీఆర్‌ఎస్)కు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు తమ కష్టాలను అధికారులకు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమానికి 270 వరకూ అర్జీలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న దందాలపై సహితం పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా ఎవరిని కదిపినా కన్నీటి వేదనే వినిపించారు. తమ సమస్యలు పరిష్కరించేవారే లేరంటూ నిట్టూర్చారు.

కదిలిస్తే.. కన్నీటి వేదన

కదిలిస్తే.. కన్నీటి వేదన
Comments
Please login to add a commentAdd a comment