కపిలేశ్వరపురం మండలం
కేదారిలంక వద్ద నదీకోత
ఇది కపిలేశ్వరపురం మండలం కేదారిలంక ప్రాంతంలో నదీకోత ఉధృతి. ఈ గ్రామంలో ఇప్పటికే సుమారు 300 ఎకరాలు నదీగర్భంలో కలిసిపోయాయని స్థానిక రైతులు చెబుతున్నారు. గతంలో వరదల సమయంలోనే కాస్త నదీకోత ఉండేది. కానీ ఎగువన మందపల్లి (కేదారిలంక) ఇసుక ర్యాంపులో తవ్వకాలు మొదలైన తరువాత కోత ఉధృతి పెరిగింది. జియో కోట్స్‌లో కపిలేశ్వరపురం ర్యాంపు అని చూపిస్తారు కానీ మందపల్లి వైపు పెద్ద ఎత్తున తవ్వుతున్నారు. ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇసుక తిన్నెలు మాయం కావడంతో మామూలు రోజుల్లో కూడా నదీ ప్రవాహం నేరుగా ఈ గ్రామాలను తాకుతోంది. దీనివల్ల కోత ఉధృతంగా మారింది. దీనిపై స్థానికులు మైనింగ్, భూగర్భ జలాలు, రెవెన్యూ, హెడ్‌వర్క్స్, ఆటవీ శాఖలకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదు. ఇక్కడ అనుమతుల కన్నా రెట్టింపు ఇసుక తవ్వడం, నీరున్న ప్రాంతంలో కూడా తవ్వేయడంతో కోత ప్రభావం మరింత పెరిగింది. ఇక్కడ తవ్వకాలపై అన్ని శాఖలూ కలిసి తనిఖీలు చేయాలని స్థానికులు కలెక్టరేట్‌లో పలు ఫిర్యాదులు చేస్తున్నా స్పందన లేదు.
పదెకరాలకు..
16 కుంచాలు మిగిలింది
మా కుటుంబానికి పదెకరాల భూమి ఉండేది. ఇప్పుడు 16 కుంచాల భూమి మాత్రమే మిగిలింది. కొంత కాలం నుంచి నదీ కోత ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే మిగిలిన 16 కుంచాల భూమి కూడా నదిలో కలిసిపోతుంది. నదీ కోత సాధారణమే అయినా అధికారుల నిర్లక్ష్యంతోనే నా భూములు కోత బారిన పడుతున్నాయి.
– యర్రంశెట్టి నాగేశ్వరరావు, కేదారిలంక
ర్యాంపులతో పెరిగిన కోత
Comments
Please login to add a commentAdd a comment