
25 నుంచి సీపీఎం ప్రజా చైతన్య సైకిల్‌యాత్ర
అమలాపురం టౌన్: కొన్ని నెలలుగా పరిష్కారం నోచుకోని ప్రజా సమస్యలపై ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకూ ప్రజలను చైతన్య పరిచే దిశగా పలు మండలాల్లో సీపీఎం ఆధ్వర్యంలో సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రజా చైతన్య సైకిల్ యాత్రకు సంబంధించిన కర పత్రాలను పార్టీ నాయకులు శుక్రవారం విడుదల చేశారు. ఈ సైకిల్ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొంటారని పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీన అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. పట్టణంతోపాటు అమలాపురం, ముమ్మిడిరం నియోజకవార్గాల్లోని నాలుగు మండలాల్లో 60 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అండ్ర మాల్యాద్రి, జిల్లా కమిటీ ప్రతినిధులు జి.దుర్గా ప్రసాద్, టి.నాగ వరలక్ష్మి, శ్యామల, శివ తదితరులు సైకిల్ యాత్ర రూట్లను వివరించారు. జిల్లాలో భూస్వాముల ఆక్రమణల్లో ఉన్న కొబ్బరి చెట్లు పేదలకు పంచాలి, అక్రమ ఆక్వా చెరువులను అరికట్టాలి, కామనగరువులో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి ప్రభుత్వం అధీనంలో నిర్మించాలి, నడవాలి, అమలాపురంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి వంటి డిమాండ్లను సైకిల్ యాత్రలో ప్రజలకు వివరించి చైతన్య పరచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment