
శక్తి టీమ్‌లతో రక్షణ
వాహనాలను ప్రారంభించిన ఎస్పీ కృష్ణారావు
అమలాపురం టౌన్: జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన అయిదు శక్తి టీమ్‌లను మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుని రక్షణ పొందాలని ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. జిల్లాలో ఈ టీమ్‌లు ఆడ పిల్లలు, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఈ శక్తి టీమ్‌ల సభ్యులైన మహిళా పోలీసులకు వాహనాలను (స్కూటీలు) ఎస్పీ కృష్ణారావు జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అయిదు శక్తి టీములను అమలాపురం పోలీస్ సబ్ డివిజన్‌కు రెండు, కొత్తపేట డివిజన్‌కు రెండు, రామచంద్రపురం డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించామని చెప్పారు. మహిళా టీమ్‌ల సభ్యులైన మహిళా పోలీసులు, ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన మహిళలతో ఎస్పీ మాట్లాడారు. శక్తి వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ యాప్ ఉపయోగాలను ఎస్పీ వివరించారు. శక్తి టీమ్ ప్రతినిధులు తమకు కేటాయించిన ఏరియా పరిధిలోని ఆడపిల్లలు, మహిళలకు చేరువగా ఉండి వారితో సత్ సంబంధాలు నిర్వహించుకోవాలని సూచించారు.
జిల్లాలోని మహిళల్లో ఎవరికై నా ఎలాంటి సమస్య ఎదురైనా ముందు ధైర్యంగా ఉండి తర్వాత శక్తి యాప్‌ను సద్వనియోగం చేసుకుని సమాచారం అందించి వారి సహాయం, సేవలు పొందాలని ఎస్పీ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ఆర్మ్‌డ్ డీఎస్పీ సుబ్బరాజు, పట్టణ సీఐ పి.వీరబాబు, సోషల్ మీడియా సీఐ జి.వెంకటేశ్వరరావు, ఎస్పీ కార్యాలయం ఏవో జగన్నాథం, మహిళా ఎస్సై గంగాభవాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment