కొత్తపేటలో కూలిన విద్యుత్‌ టవర్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్తపేటలో కూలిన విద్యుత్‌ టవర్‌

Published Wed, Apr 16 2025 12:15 AM | Last Updated on Wed, Apr 16 2025 12:15 AM

కొత్తపేటలో కూలిన విద్యుత్‌ టవర్‌

కొత్తపేటలో కూలిన విద్యుత్‌ టవర్‌

అమలాపురం రూరల్‌: రామచంద్రపురం నుంచి కొత్తపేట వచ్చే 132 కేవీ విద్యుత్‌ టవర్‌ గాలులకు కూలిపోయింది. ఈ కారణంగా కోనసీమ జిల్లాలో మంగళవారం నుంచి ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ ఇస్తామని కొనసీమ జిల్లా విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రాజబాబు తెలిపారు. కొత్తపేట టవర్‌ మీదుగా కొత్తపేట, ముమ్మిడివరం విద్యుత్‌ లైన్లుకు విద్యుత్‌ అందుతుంది. ఈ కారణంగా అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ భీమవరం 132 కేవీ సర్క్యూట్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ఈ కారణంగా ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ ఉంటుందని వినియోగదారులు సహకరించాలన్నారు. కోత్త టవర్‌ పనులు చేపట్టామని ఆయన తెలిపారు.

కోనసీమలో ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement