
క్రికెట్ టోర్నీ విజేత మల్కిపురం
అమలాపురం రూరల్: స్థానిక బాలయోగి స్టేడియంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోనసీమ జిల్లా స్థాయిలో జరిగిన జై భీమ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా మల్కిపురం నిలిచింది. అమలాపురం జట్టు ద్వితీయ స్ధానం సాధించింది. 14 రోజుల పాటు 46 జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. మంగళవారం అమలాపురం –మల్కిపురం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మల్కిపురం విజయం సాధించింది. డాక్టర్ కారెం రవితేజ, గుడ్ సీట్ ఫౌండేషన్ చైర్మన్ కుంచే రమణారావు, సీఐ వెంకటేశ్వరరావు, డాక్టర్ దిలీప్, సర్పంచ్ నక్కా చంద్రశేఖర్, తోరం గౌతమ్, చందులు విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. పెయ్యల సాయి, బడుగు అర్జున్, కుమ్మరి అభి ఈ టోర్నమెంట్ నిర్వహించారు.