
షర్మిలారెడ్డి
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) చైర్ పర్సన్‌గా మేడపాటి షర్మిలారెడ్డి నియమితులయ్యారు. ఆ పదవిని రెండోసారి ఆమెకు కేటాయిస్తూ ప్రభుత్వ కార్యదర్శి ధనుంజయరెడ్డి ఉత్తర్వులు వెలువరించారు. రుడా శాఖ ప్రారంభం సమయంలో చైర్ పర్సన్‌గా ఎన్నికై న ఆమె రెండేళ్ల పాటు పదవిలో కొనసాగారు. తాజాగా మరోసారి పొడిగించారు. రెండేళ్ల కాలంలో తూర్పు, కోనసీమ జిల్లాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా పూర్తి చేశారు. తనకు తిరిగి పదవి అప్పగించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి, సహకరించిన నాయకులకు షర్మిలారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేసి, ప్రభుత్వంపై ప్రజలకు మంచి భావన వచ్చేలా కృషి చేస్తానన్నారు.