విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసన్ననగర్‌కు చెందిన గోపిశెట్టి నాగేశ్వరరావు (65) స్థానిక సిరి అపార్ట్‌మెంట్‌లో సొంత ఫ్లాట్‌లో భార్య విజయలక్ష్మితో కలిసి జీవిస్తున్నాడు. ఆయన పశుసంవర్ధక శాఖలో టెక్నీషియన్‌గా పనిచేసి ఐదేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో బెడ్ రూంలో ఫ్యాన్‌కు బెల్ట్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. భార్య చూసి పొరుగువారి సాయంతో ఆయనను కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా నాగేశ్వరరావు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు విదేశాల్లో స్థిరపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment