ఉత్కంఠగా ఆలిండియా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్, స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ పురుషులు, మహిళల పోటీలు శుక్రవారం ఉల్లాసంగా జరిగాయి. శుక్రవారం నిర్వహించిన మ్యాచ్‌లను చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రవి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మహిళల విభాగంలో రాజస్థాన్ సెక్టార్, ఏపీ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏపీ సెక్టార్ 15–0 స్కోర్‌తో, సెంట్రల్ సెక్టార్, కేరళా సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ సెక్టార్ 5–0 స్కోర్‌తో, ఛత్తీస్‌ఘడ్ సెక్టార్, మధ్యప్రదేశ్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌ఘడ్ 22–0 స్కోర్‌తో విజయం సాధించాయి. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్ సెక్టార్, మహారాష్ట్ర సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర సెక్టార్ 6–2 స్కోర్‌తో, ఆర్బీఎస్ కాన్‌పూర్, ఆర్బీఎస్ జైపూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్బీఎస్ కాన్‌ఫూర్ 4–2 స్కోర్‌తో గెలుపొందాయి. ఛత్తీస్‌ఘడ్ సెక్టార్, ఉత్తర్‌ప్రదేశ్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌ఘడ్ 5–0 స్కోర్‌తో విజయం సాధించాయి.
అలరించిన క్యాంప్ ఫైర్
ఆలిండియా హాకీ పోటీల సందర్భంగా శుక్రవారం రాత్రి క్రీడా మైదానంలో క్యాంప్ ఫైర్ నిర్వహించారు. ఈ క్యాంప్ ఫైర్‌ను కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ఎస్పీ బిందుమాధవ్ ప్రారంభించారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఆయా రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఉల్లాసంగా, సంతోషంగా గడిపారు. ఈ క్యాంప్ ఫైర్‌లో డీఆర్వో వెంకట్రావు, ఆర్డీఓ మల్లిబాబు, డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment