కాకినాడ లీగల్: ఇంట్లోకి ప్రవేశించి మహిళ నోటిలో రుమాలు కుక్కి బీరువాలోని రూ.8 లక్షలు, వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ముగ్గురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కాకినాడ ఐదో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ షరీన్ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన మల్లాడి దుర్గాప్రసాద్, కాకినాడ ఏటిమొగ ప్రాంతానికి చెందిన డొక్కాడి మహేష్, పేసింగి ప్రసాద్ కలసి 2023 ఏప్రిల్ 30న కాకినాడ రూరల్, ఇంద్రపాలెం మార్కెట్ సమీపంలో ఉంటున్న వెదుళ్లపల్లి సుధారాణి ఇంట్లోకి రాత్రి 8 గంటల సమయంలో వెళ్లి ఆమెను నోటిలో రుమాలు కుక్కారు. బీరువాలో ఉన్న రూ.8 లక్షలు, వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. దీంతో సుధారాణి ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నిందితుల నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఏడాది జైలు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment