కనులకు అందం.. కవలల బంధం
ఫ రూపం ఒకటే.... శరీరాలు రెండు
ఫ నేడు ప్రపంచ కవలల దినోత్సవం
బిక్కవోలు/ కరప: సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు.. అలాంటి ఏడుగురు మనకు కనిపిస్తారో లేదో తెలియదు కానీ మన చుట్టుపక్కల కవలలను చూస్తే నిజమేనని అనిపిస్తుంది. రూపం ఒకటే.. శరీరాలు రెండుగా ఉండే వీరిని చూస్తే ఆశ్చర్యం కలగదు మానదు. మా పేరేంటో చెప్పుకోండని వారు చిలిపిగా అడిగే ప్రశ్నకు రోజూ చూస్తున్న వారే తికమక పడుతుండడం చూస్తుంటాం.. అశ్వినీ దేవతలు, లవకుశలు కవలలని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. ఒకే రూపంలో ఉండే కవలలంటే ఇష్టపడని హృదయం ఉండదు. గతంలో ఎక్కడో కనిపించే కవలలు నేడు ఎక్కడికక్కడే దర్శనమిస్తున్నారు. అలాంటి కవలల దినోత్సవాన్ని జరుపుకోవడానికి వారు ఉత్సుకత చూపుతున్నారు. 1919లో పోలెండ్ దేశం బర్గ్ పట్టణంలో మోజేష్, ఆరెన్ విల్‌కార్స్ అనే కవలలు జన్మించారు. ఆడుతూ పాడుతూ జీవిస్తున్న వీరు ఒకే సమయంలో ఒకే రకమైన వ్యాధి సోకి మృతి చెందారు. ఆ దేశఽ నేతలు వారికి గుర్తుగా ఆ పట్టణాన్ని ట్విన్స్ బర్గ్‌తో పిలిచారు. అనంతరం 1976 ఫిబ్రవరి 22న ప్రపంచ కవలల దినోత్సవం నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా జరుపుకొంటున్నారు.. ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉండే కవలల గురించి తెలుసుకుందాం రండి..
చదువులో తప్ప..
అక్షత, ఆస్రితలు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. వీరి చదువులో తప్ప మిగతా అన్నింట్లో ఒకే అభిరుచి కలిగి ఉంటున్నారు. అక్షత చదువులో మరింత బాగా చదువుతుంది. వారు తినే ఆహారం నుంచి వేషధారణ వరకూ ఇద్దరూ ఒకే రకంగా ఇష్టపడుతున్నారు.
–ఆకే అక్షత, ఆస్రిత, పందలపాక
అందుకే పెద్దోడినయ్యా..
మా ఇద్దరం కేవలం 20 నిమిషాల వ్యవధిలో జన్మించారు. అందువల్ల నేను అన్నయ్యను అయిపోయాను. పేరుకే అన్నయ్యను. కానీ తను ప్రతి విషయంలో నా కంటే ముందుగా ఆలోచిస్తుంది. నాకు అక్కలా సలహాలు ఇస్తుంది. మా ఇద్దరి ఆలోచనలు, అభిరుచి ఒకేలా ఉంటాయి.
–తరుణ్ శ్రీతేజ్, తనుజశ్రీ పల్లవి, జి.మామిడాడ
ఎప్పుడూ కలిసే ఉంటాం..
ఆహారం విషయాల్లో మా ఇద్దరి ఆలోచన ఒకేలా ఉండదు. మిగతా విషయాల్లో ఒకేలా అనుకుంటాం. చదువుతో పాటు అన్ని విషయాలు తల్లిదండ్రులు కోరిక మేరకే చేస్తుంటాం. ఎప్పుడూ కలిసే ఉంటాం.
–దొంతంశెట్టి త్రిపుర, తేజశ్రీ, కొంకుదురు సావరం
తికమక పడుతుంటారు..
మా ఇద్దరినీ చూసి అందరూ తికమక పడుతుంటారు. గురజనాపల్లిలోని పబ్బినీడి పాపారావు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాం. మా రూపం, చేష్టలు ఒకేలా ఉండడంతో మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో ఇష్టంగా చూస్తున్నారు.
–పంపన దేవి, పంపన లక్ష్మి, డవిపూడి, కరప మండలం
కనులకు అందం.. కవలల బంధం
కనులకు అందం.. కవలల బంధం
కనులకు అందం.. కవలల బంధం
కనులకు అందం.. కవలల బంధం
Comments
Please login to add a commentAdd a comment