జన గణనతో పాటే కుల గణన
కాకినాడ రూరల్: జాతీయ స్థాయిలో ఈసారి జరిపే జన గణనతో పాటే కుల గణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. కాకినాడలో నాగమల్లితోట జంక్షన్ వద్ద శుక్రవారం నిర్వహించిన బీసీ సంఘ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుల గణన చేపట్టాల్సిన ప్రాధాన్యతను కేంద్రానికి తెలిసేలా ఉద్యమాలు, కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. చట్ట సభలో బీసీలకు సరైన రిజర్వేషన్లు కల్పించాలన్నా, జస్టిస్ రోహిణి కమిషన్ సిఫారసుల మేరకు ఓబీసీల వర్గీకరణ జరపాలన్నా, మండల కమిషన్ సిఫారసులను సంపూర్ణంగా అమలు పరచాలన్నా బీసీ కుల గణన జరపవల్సి ఉందన్నారు. అనంతరం జిల్లా నూతన వర్గానికి నియామకపు పత్రాలు అందించారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా గుత్తుల రమణ నియమితులవ్వడంతో ఆయనతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులకు నియామకపు పత్రాలు అందించారు.
త్వరలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అవగాహన ర్యాలీ
ఏపీ బీసీ సంక్షేమ సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు
Comments
Please login to add a commentAdd a comment