23న ఆర్‌బీసీ సీజన్‌ 2 హేవ్‌ లాక్‌షో | - | Sakshi
Sakshi News home page

23న ఆర్‌బీసీ సీజన్‌ 2 హేవ్‌ లాక్‌షో

Published Sat, Feb 22 2025 2:02 AM | Last Updated on Sat, Feb 22 2025 1:58 AM

23న ఆర్‌బీసీ సీజన్‌ 2 హేవ్‌ లాక్‌షో

23న ఆర్‌బీసీ సీజన్‌ 2 హేవ్‌ లాక్‌షో

రాజమహేంద్రవరం సిటీ: బౌ.. వావ్‌ పెట్‌ షాపీ, స్పా సమర్పణలో ఈ రాజమహేంద్రవరం జేఎన్‌ రోడ్‌లో ఈ నెల 23 న రాజమండ్రి బ్రీడ్‌ చాంపియన్‌ షిప్‌ సీజన్‌ 2 హేవ్‌ లాక్‌ షో (డాగ్‌, కేట్‌ షో) నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తరుణ్‌ కలిం తెలిపారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 23 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుంచి షో జరుగుతుందని తెలిపారు. రాజమండ్రి బ్రీడ్‌ చాంపియన్‌ షిప్‌ సీజన్‌ 1కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని సీజన్‌ 2 మరింత గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా హేవ్‌ లాక్‌ బ్రిడ్జి నిలిచిందని, తాము నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాలకు వారధిగా నిలవాలని హేవ్‌ లాక్‌ షోగా నామకరణం చేశామన్నారు. ఈ షోలో 50 రకాల డాగ్స్‌, కేట్‌ బ్రీడ్‌లు పాల్గొంటాయన్నారు. సీజన్‌ 1 లో ఏపీ, తెలంగాణ, ఒడిశాల నుంచి బ్రీడ్‌లు పాల్గొన్నాయని, సీజన్‌ 2 కి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా బ్రీడ్‌లు హాజరు అవుతాయన్నారు. చాంపియన్‌గా నిలిచిన డాగ్‌కు రూ.50 వేలు బహుమతి అందజేస్తామన్నారు. మన రాష్ట్ర బ్రీడ్‌ అయిన కొల్లేటి జాగిలం విశిష్టత తెలియజేసే విధంగా కొల్లేటి జాగిలం డాగ్‌ ప్రత్యేక షో జరుగుతుందన్నారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ కెన్నిల్‌ క్లబ్‌ కార్యదర్శి, కెన్నల్‌ క్లబ్‌ ఆప్‌ ఇండియా సభ్యులు విశాల్‌ సుదాన్‌, జడ్జిలుగా ప్రొఫెషనల్‌ ట్రైనర్‌లు టి.సతీష్‌గౌడ, జి.దినేష్‌గౌడలు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా షో పోస్టర్‌ను విడుదల చేశారు. విలేకర్ల సమావేశంలో శ్రీను, నాగేంద్ర, నాని, దీపక్‌, అఖిల్‌, బాజీ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement