అంబాజీపేట కొబ్బరి మార్కెట్
విద్యుత్ తీగ తెగిపడి తాటాకిళ్లు దగ్ధం
తుని రూరల్: తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో విద్యుత్ సర్వీస్ తీగలు తెగిపడడంతో మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పెద్దాడ నూకరాజు, కాకాడ నాగలక్ష్మి, బత్తిన శ్రీరామ్మూర్తి ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం తెలియడంతో తుని నుంచి అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి చేరుకుని సమీప ఇళ్లకు మంటలు వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. నూకరాజు, నాగలక్ష్మి, శ్రీరామ్మూర్తి కుటుంబాలు వేర్వేరు పనులకు వెళ్లిన తర్వాత విద్యుత్ లైను నుంచి ఇంటికి సరఫరా అయ్యే సర్వీసు తీగలు తెగిపడడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు అగ్నిమాపక అధికారి కె.రాముడు తెలిపారు. సుమారు రూ.రెండు లక్షల ఆస్తినష్టం జరిగినట్టు వివరించారు. రూ.లక్ష నగదు, బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం పూర్తిగా కాలి బూడిదైందని నూకరాజు కుటుంబ సభ్యులు వాపోయారు. బాధితులకు న్యాయం చేస్తామని, ఆర్థిక సాయం కోసం కలెక్టర్‌కు నివేదిక పంపిస్తామని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment