మూడు మట్టి లారీల సీజ్
రావులపాలెం: ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను రావులపాలెం మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం రాత్రి సీజ్ చేశారు. తహసీల్దార్ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో అక్రమంగా, అనుమతులు లేకుండా బొండు మట్టిని తరలిస్తున్న మూడు లారీలను స్థానిక ఊబలంక, రావులపాలెం రోడ్డులో తనిఖీల్లో పట్టుకున్నారు. ఒక్కో లారీకి రూ.15 వేల చొప్పున మొత్తం రూ. 45 వేలు జరిమానా విధించినట్లు తహసీల్దార్ తెలిపారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment