లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 15 వేల మంది క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1.12.800. పూజా టికెట్లకు రూ.68 వేలు, కేశఖండనకు రూ.11,400, వాహన పూజలకు రూ.4,500, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.34,610, విరాళాలు రూ.72,972 కలిపి మొత్తం రూ.3,04,285 ఆదాయం సమకూరిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment